అయోధ్యకు బయల్దేరుతూ అభిమానులను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్
Add ap7am to your home Screen

అయోధ్యకు బయల్దేరుతూ అభిమానులను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్

Chiranjeevi and Ram Charan meet and greet fans before they leave for Ayodhya
  • అయోధ్యలో రేపు రామ మందిరం ప్రారంభోత్సవం
  • చిరంజీవి, రామ్ చరణ్ లకు ఆహ్వానాలు
  • ఈ సాయంత్రం అయోధ్య పయనమైన చిరంజీవి, రామ్ చరణ్
అయోధ్యలో రేపు (జనవరి 22) రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లకు కూడా ఆహ్వానం అందింది. ఈ సాయంత్రం చిరంజీవి, రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి అయోధ్యకు బయల్దేరేముందు అభిమానులను కలిశారు. అభిమానుల ఉత్సాహాన్ని చూసి చిరంజీవి, రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు చిరంజీవి, రామ్ చరణ్ లకు శ్రీరామ ప్రతిమను బహూకరించారు. పలువురు అభిమానులు రక్తదానం కూడా చేశారు.

అంతకుముందు, చిరంజీవి తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అందిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇది ఆ దేవుడు పంపిన ఆహ్వానంగా భావిస్తానని తెలిపారు. "ఆ అంజనాదేవి పుత్రుడు 'చిరంజీవి' హనుమంతుడు... భువిపై ఉన్న ఈ అంజనాదేవి పుత్రుడు చిరంజీవికి పంపిన ఆహ్వానం" అంటూ అభివర్ణించారు.
Advertisement
Chiranjeevi
Ram Charan
Fans
Ayodhya Ram Mandir
Hyderabad
Tollywood

More Telugu News