బిల్లులు ఆపిన వారే పోరాడుతామని చెప్పడం విడ్డూరంగా ఉంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- పార్టీలో కష్టపడి పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు దక్కుతుందన్న ఉత్తమ్
- విద్యార్థి దశ నుంచే వారు కాంగ్రెస్ పక్షాన పలు ఉద్యమాల్లో పాల్గొన్నారన్న మంత్రి
- ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అవుతాయని ఆశాభావం
ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ... పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపు దక్కుతుందన్నారు. ఇందుకు మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌లు నిదర్శనమన్నారు. వీరు సుదీర్ఘకాలం పార్టీలో పని చేస్తున్నారన్నారు. విద్యార్థి దశ నుంచే వారు కాంగ్రెస్ పక్షాన పలు ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు. ఇప్పుడు వారి కష్టానికి, త్యాగానికి సరైన ఫలితం దక్కిందన్నారు. ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.