Advertisement

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం... పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా

Gidugu Rudraraju resigns for AP PCC Chief post
  • ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు
  • రాజీనామా లేఖను ఖర్గేకు అందించిన గిడుగు
  • ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ కు కొత్త నాయకత్వం
ఏపీ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. వైఎస్ షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గిడుగు రుద్రరాజు రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. 

గిడుగు రుద్రరాజు ఇవాళ తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. ఈ క్రమంలో, ఎల్లుండి లోపు ఏపీ కాంగ్రెస్ కొత్త చీఫ్ పేరును ఏఐసీసీ ప్రకటించే అవకాశాలున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్ పదవిపై షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి హామీ లభించినట్టు తెలుస్తోంది.
Advertisement
Gidugu Rudra Raju
PCC
Congress
YS Sharmila
Andhra Pradesh

More Telugu News