చంద్రబాబు, పవన్ ఫొటో పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు
- సంక్రాంతి వేడుకల్లో భాగంగా గంగిరెద్దుతో ఫొటో దిగిన చంద్రబాబు, పవన్
- ఈ ఫొటో షేర్ చేస్తూ బాబు పక్కన రెండు గంగిరెద్దులు అంటూ అంబటి ట్వీట్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మంత్రి ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు
ఈ ఫొటోను టీడీపీ, జనసేన నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంత్రి అంబటి రాంబాబు ఈ ఫొటోను షేర్ చేస్తూ.. ‘బాబు పక్కన రెండు గంగిరెద్దులు’ అంటూ కామెంట్ చేశాడు. ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు, టీడీపీ, జనసేన అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. పలువురు రాజకీయ నేతలు కూడా మంత్రి తీరును తప్పుబడుతున్నారు.