కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి యువకుడి బలి

Car Accident In Kukatpally Housing Board
  • కూకట్ పల్లిలో బైక్ ను ఢీ కొట్టిన కారు
  • తీవ్ర గాయాలతో బైకర్ దుర్మరణం
  • స్కోడా కారు డ్రైవర్ పై కేసు నమోదు
హైదరాబాద్ లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి యువకుడు బలయ్యాడు. స్నేహితుడితో కలిసి బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకొచ్చిన స్కోడా కారు ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కూకట్ పల్లిలోని హౌసింగ్ బోర్డ్ లో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మోతీనగర్ కు చెందిన అరుణ్ (33) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

ఆదివారం తన బైక్ పై హౌసింగ్ బోర్డ్ కాలనీకి వెళ్లాడు. స్నేహితుడితో కలిసి హైదర్ నగర్ వైపు వెళుతుండగా ఓ స్కోడా కారు వీరి బైక్ ను వేగంగా ఢీ కొట్టింది. దీంతో అరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలు, తీవ్ర రక్తస్రావం కారణంగా అరుణ్ స్పాట్ లోనే చనిపోయాడు. ఈ ప్రమాదానికి కారు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు, పోలీసులు ఆరోపించారు. స్కోడా కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
Go Back to Shorts
KPHB
Car Accident
Youth Dead
Kukatpally
Scoda Car

More Telugu News