సలార్ పార్ట్-2 ఇంకా సూపర్ గా ఉంటుంది: ప్రభాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సలార్ పార్ట్-2 ఇంకా సూపర్ గా ఉంటుంది: ప్రభాస్

Salaar part 2 will be more wonderful says Prabhas
  • సలార్ మూవీ కథ తనకు ఎంతో నచ్చిందన్న ప్రభాస్
  • బాహుబలి తర్వాత సినిమాలన్నీ వెరైటీగా ఉండేలా చూసుకున్నానన్న రెబల్ స్టార్
  • రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పని చేయడం గొప్ప అనుభూతి అని వ్యాఖ్య
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన 'సలార్' చిత్రం ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ ను ఈ సినిమా షేక్ చేస్తోంది. ప్రభాస్ కెరీర్లో మరో సూపర్ హిట్ పడింది. తాజాగా హాలీవుడ్ కు చెందిన ఓ మీడియాతో ప్రభాస్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సలార్ మూవీ కథ తనకు ఎంతో నచ్చిందని... అందుకే కథను విన్న వెంటనే ఓకే చెప్పానని తెలిపారు. తన కెరీర్లో 'బాహుబలి' ఇక బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసిందని... ఆ తర్వాత సినిమాలన్నీ కొత్తదనం ఉండేలా చూసుకున్నానని... అందులో భాగంగానే 'సలార్' సినిమాకు ఓకే చెప్పానని అన్నారు. 

సలార్ పార్ట్ 2 మరింత అద్భుతంగా ఉంటుందని తెలిపారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పని చేయడం ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారతీయ చిత్రాల గురించే చర్చించుకుంటోందని... బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా గుర్తిస్తున్నారని అన్నారు.
Advertisement
Prabhas
Tollywood
Salaar

More Telugu News