మీకు ఓట్లేస్తే చంద్రబాబు సీఎం అవుతారనేదాన్ని జనసైనికులు ఒప్పుకోలేరు: పవన్ కు హరిరామజోగయ్య లేఖ
- చంద్రబాబే సీఎం అని లోకేశ్ చెపుతున్నారన్న జోగయ్య
- చంద్రబాబు సీఎం కావడానికి మీరు కూడా ఒప్పుకున్నారా అని ప్రశ్న
- మీరు సీఎం కావాలని కోరుకుంటున్న వారి కలలు ఏం కావాలన్న జోగయ్య
లోకేశ్ చెపుతున్నట్టుగా ఐదేళ్ల పాటు చంద్రబాబును సీఎంగా చేసేందుకు మీరు కూడా ఒప్పుకున్నారా? అని లేఖలో పవన్ ను జోగయ్య ప్రశ్నించారు. జనసైనికులంతా మీరే సీఎం కావాలని కోరుకుంటున్నారని... మీరు సీఎం కాకపోతే వారి కలలు ఏం కావాలని ప్రశ్నించారు. మీకు ఓట్లేస్తే చంద్రబాబు సీఎం అవుతారనేదాన్ని జనసైనికులు ఒప్పుకోలేరని అన్నారు. మీరు నీతివంతమైన పాలన అందిస్తారని భావించే ప్రజానీకానికి మీరు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. రెండు కులాల నాయకులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నారని... బడుగు, బలహీనవర్గాలకు మోక్షం ఎప్పుడని అడిగారు.