యువగళం సభ కోసం విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్
- డిసెంబరు 18న ముగిసిన లోకేశ్ యువగళం పాదయాత్ర
- నేడు విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద విజయోత్సవ సభ
- హాజరవుతున్న చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ, పవన్ కల్యాణ్
ఈ సభ కోసం ఇప్పటికే చంద్రబాబు, బాలకృష్ణ విచ్చేశారు. తాజాగా, యువగళం సభలో పాల్గొనేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయనకు జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అందరికీ అభివాదం చేస్తూ పవన్ ముందుకు కదిలారు. కాసేపట్లో యువగళం-నవశకం సభ ప్రారంభం కానుంది.
