అర్ధరాత్రి నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఇరువైపుల పోలీసుల మోహరింపు!
- నీటిని విడుదల చేయకపోవడంతో ఏపీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన
- అర్ధరాత్రి డ్యామ్‌పైకి వందలాదిమంది ఏపీ పోలీసులు
- అడ్డుకున్న సిబ్బందిపై దాడిచేసి మొబైల్ ఫోన్లు, సీసీ కెమెరాల ధ్వంసం
- ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్
- నీటి విడుదలను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
- కుట్రలో భాగమేనన్న కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్ వద్దకు చేరుకుని ఏపీ పోలీసులతో మాట్లాడారు. డ్యామ్ నిర్వహణ విషయం నీటిపారుదల అధికారులకు సంబంధించిన విషయమని, ముళ్లకంచెను తీసేయాలని సూచించారు. అయితే, వారు స్పందించకపోవడంతో చేసేది లేక వెనక్కి వెళ్లిపోయారు. రాష్ట్ర విభజన సమయంలో నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది.