Dharmapuri Arvind: కవిత బిజినెస్ పార్ట్ నర్ రేవంత్ రెడ్డి: ధర్మపురి అర్వింద్

  • కేసీఆర్, రేవంత్ రెడ్డి తోడు దొంగలన్న అర్వింద్
  • కవిత జీవితంలో ఎన్నికల్లో నిలబడదని వ్యాఖ్య
  • రేవంత్ ను కేసీఆర్ జైలుకు ఎందుకు పంపడం లేదని ప్రశ్న
Revanth Reddy is Kavitha partner says Dharmapuri Arvind
Listen to the audio version of this article

ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ కంటే ఎక్కువగా భూములను రేవంత్ అమ్ముతారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత బిజినెస్ పార్ట్ నర్ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ఇకపై జీవితంలో ఎన్నడూ కవిత ఎన్నికల్లో నిలబడదని, నిలబడినా గెలవదని చెప్పారు. రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైలుకు ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కొంప ముంచింది కాంగ్రెస్ పార్టీనే అని... ఈ ఫ్యాక్టరీ ఓపెన్ కావాలంటే తెలంగాణలో బీజేపీ గెలవాలని చెప్పారు. కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. 

More Telugu News