Lavanya Tripathi: వరుణ్ తేజ్ తో పెళ్లికి సంబంధించి మరికొన్ని ఫొటోలను పంచుకున్న లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi shares some more pics of her wedding with Varun Tej

  • ఇటీవల పెళ్లితో ఒక్కటైన టాలీవుడ్ లవ్ జంట
  • ఇటలీలోని టస్కనీలో వివాహ వేడుక
  • హైదరాబాదులో గ్రాండ్ గా రిసెప్షన్
  • అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన లావణ్య 

టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ ప్రేమను పండించుకుని, ఇటీవల పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి ఇటలీలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం టస్కనీలో ఘనంగా జరిగింది. హైదరాబాదులో రిసెప్షన్ కూడా గ్రాండ్ గా జరిగింది. 

కాగా, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇంకా పెళ్లి జోష్ లోనే ఉన్నారు. తాజాగా, లావణ్య త్రిపాఠి తమ పెళ్లికి సంబంధించిన మరికొన్ని ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. వరుణ్ తేజ్ ఒక అద్భుతమైన వ్యక్తి అని, తనను ఎంతో పదిలంగా చూసుకునే అలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని, ఇప్పుడు అతడే తన భర్త అయ్యాడని లావణ్య వెల్లడించింది. 

"ఈ సందర్భంగా ఎన్నో చెప్పాలి అనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇలాంటి ముచ్చట్లు మా మధ్యనే ఉంచుకుంటాం లెండి! మూడ్రోజుల పాటు సాగిన మా పరిణయ మహోత్సవం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఓ తియ్యని కలలా సాగింది. మా వివాహం ఎలా జరగాలని కోరుకున్నామో అలాగే జరిగింది. మా పెళ్లి చిరస్మరణీయంగా జరిగేందుకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అంటూ లావణ్య తన పోస్టులో పేర్కొంది.

Lavanya Tripathi
Varun Tej
Wedding
Love
Tollywood
  • Loading...

More Telugu News