'వార్ 2'లో ఎన్టీఆర్ జోడీ కట్టే బ్యూటీ గురించే హాట్ టాపిక్!
- గతంలో హిట్ కొట్టిన 'వార్' సినిమా
- ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న 'వార్ 2'
- 'దేవర' తరువాత జాయిన్ కానున్న ఎన్టీఆర్
- కథానాయికలుగా తెరపైకి అలియా - కియారా పేర్లు
గతంలో హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన 'వార్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 150 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 475 కోట్లను వసూలు చేసింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా 'వార్ 2' రూపొందుతోంది. హృతిక్ రోషన్ పై కొన్ని కీలకమైన సీన్స్ ను అయాన్ ముఖర్జీ చిత్రీకరిస్తున్నాడు. 'దేవర' తరువాత ఈ సినిమా షూటింగులో ఎన్టీఆర్ జాయినవుతాడని అంటున్నారు.
ఈ సినిమాలో ఒక కథానాయికగా అలియా భట్ ను తీసుకున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఇక మరో నాయికగా కియారా అద్వానీని ఎంపిక చేశారనే వార్త తాజాగా తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరు హీరోయిన్లలో ఏ హీరో సరసన ఎవరు చేయనున్నారనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే అభిమానుల సస్పెన్స్ తొలగిపోతుందని చెప్పచ్చు.