ఓటీటీలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ ... అంతా వట్టిదే!
- ఇటీవల ఇటలీలోని టస్కనీలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి
- పెళ్లి వీడియోను నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేయనున్నారంటూ వార్తలు
- వార్తలను కొట్టిపారేసిన వరుణ్ తేజ్ టీమ్
దీనిపై వరుణ్ తేజ్ టీమ్ స్పందించింది. ఇదంతా వట్టి పుకారేనని స్పష్టం చేసింది. వరుణ్ తేజ్ పెళ్లి వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ఇలాంటి వార్తలను నమ్మవద్దని స్పష్టం చేసింది. ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలని, వీటిని వ్యాప్తి చేయవద్దని పేర్కొంది.