తెలంగాణ ఎన్నికలు.. కాంగ్రెస్ కు ముస్లిం లీగ్ పార్టీ మద్దతు
- కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టు ప్రకటించిన ఐయూఎంఎల్
- రాహుల్ కు లేఖ రాసిన ముస్లిం లీగ్ పార్టీ
- ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఐయూఎంఎల్ తన లేఖలో పేర్కొంది. తెలంగాణలో తమ పార్టీ వేళ్లు బలంగా ఉన్నాయని తెలిపింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని ఓడించి తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం ఇండియా కూటమి భాగస్వామిగా తమ పార్టీ పని చేస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ గెలుపు కోసం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపింది.