Advertisement

హుజూరాబాద్‌లో నలభై ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది: వొడితల ప్రణవ్

vodithala pranav meeting with congress cadre
  • ఇల్లంతకుంట మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ప్రణవ్
  • హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారన్న పార్టీ అభ్యర్థి
  • ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపు
హుజూరాబాద్ నియోజకవర్గంలో నలభై సంవత్సరాల తర్వాత తిరిగి కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నియోజకవర్గంలో ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే అన్నారు. మన పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లి, పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేదలకు, ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తుందన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు పలు సంక్షేమ పథకాలను అమలు చేసే మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీది అన్నారు.
Advertisement
vodithala pranav
Congress
Huzurabad
Telangana Assembly Election

More Telugu News