రెండో పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై ప్రగతి స్పందన... వీడియో ఇదిగో!
Add ap7am to your home Screen

రెండో పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై ప్రగతి స్పందన... వీడియో ఇదిగో!

Pragathi reacts to speculations
  • ఓ స్టార్ ప్రొడ్యూసర్ తో ప్రగతి పెళ్లి అంటూ కథనాలు
  • సాక్షి మీడియాపై ధ్వజమెత్తిన ప్రగతి
  • ఆధారాల్లేకుండా ఎలా రాస్తారని ఆగ్రహం
  • నా వ్యక్తిగత జీవితంపై రాసే హక్కు మీకెక్కడిది అంటూ ఫైర్
  • ఇకనైనా నిజానిజాలు నిర్ధారించుకుని వార్తలు రాయండి అంటూ హితవు
ప్రముఖ నటి ప్రగతి రెండో పెళ్లి చేసుకుంటోందని, ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఆమె వద్ద పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా, ఆమె అంగీకరించిందని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ప్రగతి స్పందించారు. ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్టు చేశారు. 

ప్రగతి ఏమన్నారంటే.. "నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానంటూ సాక్షి వంటి ప్రముఖ మీడియాలో వార్త వచ్చింది. ఇది అత్యంత బాధ్యతారాహిత్యంతో కూడిన విషయం. మీరు (సాక్షి) ఒక సంస్థను నడుపుతున్నారు... అందులో ఎంతోమంది చదువుకున్నవాళ్లు ఉంటారు... మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లు ఉంటారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక న్యూస్ ను ప్రచారం చేశారు. నేను కేవలం ఒక నటిని మాత్రమే కావొచ్చు... మీరేం రాసినా చెల్లుతుందని అనుకుంటున్నారా? నేను దీన్ని ఖండిస్తున్నాను. 

నా వ్యక్తిగత జీవితంపై రాసే హక్కు మీకెక్కడిది? ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఇష్టం వచ్చినట్టు రాయడం బాధాకరం. ఆధారాలు ఉన్నప్పుడు రాస్తే ఫర్వాలేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాయడం ద్వారా సాక్షి వంటి ప్రముఖ మీడియా సంస్థను దిగజార్చకండి. ఇకనైనా నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే రాయండి. జర్నలిస్టు విలువలు అనేవి ఉంటే వాటిని పాటించండి. నాపై వార్త రాయడం మాత్రం కచ్చితంగా అనైతికం" అంటూ  ప్రగతి తీవ్ర స్వరంతో విమర్శించారు.
Advertisement
Pragathi
Marriage
News
Tollywood

More Telugu News