'ఇండియా టుడే సంచలన సర్వే'... కాంగ్రెస్ పార్టీ ట్వీట్
- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 54, బీఆర్ఎస్కు 49 సీట్లు వస్తాయన్న సర్వే
- తెలంగాణలో తమ పార్టీ హవా కొనసాగుతుందని కాంగ్రెస్ ధీమా
- 75 సీట్లను టార్గెట్గా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 54 సీట్లు, బీఆర్ఎస్కు 49 సీట్లు రావొచ్చునని ఇండియా టుడే - సీ వోటరు సర్వే నివేదిక తెలిపింది. బీజేపీ ఎనిమిది, ఇతరులు ఎనిమిది సీట్లు గెలుచుకోవచ్చునని ఈ సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే 11 శాతం ఓటు బ్యాంకు పెరిగి 39 శాతానికి, బీఆర్ఎస్కు 9 శాతం తగ్గి 38 శాతానికి పడిపోతుందని, బీజేపీ ఓటు శాతం 7 శాతం నుంచి 9 శాతం పెరిగి 16 శాతానికి చేరుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది.
బీఆర్ఎస్ 49 సీట్లు, మజ్లిస్ పార్టీ 7 సీట్లు గెలుచుకుంటే ఈ రెండు పార్టీలు కలిసినా 56 సీట్లు మాత్రమే ఉంటాయని ఈ సర్వే వెల్లడించింది. అప్పుడు బీఆర్ఎస్కు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు అవసరం. అయితే కాంగ్రెస్ 75 సీట్లలో గెలుపు లక్ష్యంగా పెట్టుకుంది.