కంటతడి పెట్టిన నారా లోకేశ్.. వీడియో ఇదిగో!
- 45 సంవత్సరాలు క్రమశిక్షణతో చంద్రబాబు మనకోసం కష్టపడ్డారన్న లోకేశ్
- ప్రజానాయకుడిని 43 రోజులుగా జైలులోనే ఉంచారని ఆవేదన
- స్కిల్ కేసులో మిగతా వారంతా నెల రోజుల్లో బయటకొచ్చారని గుర్తుచేసిన లోకేశ్
ఇది కలలో కూడా ఊహించలేనిదని, తలుచుకుంటేనే దుఃఖం తన్నుకొస్తోందని లోకేశ్ ఆవేదన చెందారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ప్రజానాయకుడిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఆలోచించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, తండ్రి పరిస్థితి గురించి చెబుతూ లోకేశ్ కన్నీటిపర్యంతమయ్యారు. స్కిల్ కేసులో మిగతా వారందరూ 32 రోజుల్లోనో, 38 రోజుల్లోనో బయటకు రాగా చంద్రబాబును మాత్రం జైలులోనే ఉంచేశారంటూ గద్గద స్వరంతో చెప్పారు.