రాజకీయంగా నష్టపోతామని తెలిసినా మీ ఆకాంక్ష నెరవేర్చాం: ములుగు కాంగ్రెస్ విజయభేరీ సభలో ప్రియాంకగాంధీ
- కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందన్న ప్రియాంక
- బీఆర్ఎస్ పాలనలో ఆశలు అడియాసలు అయ్యాయని వ్యాఖ్య
- మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్ నాయకురాలు
తెలంగాణ వస్తే యువత ఆత్మహత్యలు ఆగుతాయని, రైతుల జీవితాలు బాగుపడతాయని భావించారని, కానీ బీఆర్ఎస్ పాలనలో అవేమీ జరగలేదన్నారు. మీ ఆశలను అడియాసలు చేసిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఆలోచించకుండా తాము తెలంగాణను ఇచ్చామన్నారు. నెహ్రూ నుంచి సోనియా వరకు అందరూ దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించినట్లు చెప్పారు. ఇప్పటికైనా మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.
తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వరికి రూ.2500, మొక్కజొన్నకు రూ.2200 మద్దతు ధర ఇస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇందిరమ్మ భరోసా కింద రూ.15వేలు ఇస్తామన్నారు.