వారేం చెబితే పురందేశ్వరి అదే చేస్తారు: మాజీ మంత్రి గంటా
- వైసీపీ నేతలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శ
- చంద్రబాబు అక్రమ అరెస్ట్ ప్రభావం తెలంగాణ ఎన్నికలపై ఉంటుందన్న గంటా
- బీజేపీ తమతో ఎంత వరకు కలిసి వస్తుందో కాలం నిర్ణయిస్తుందన్న మాజీ మంత్రి
వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే లక్ష్యం కోసం పని చేసే అన్ని పార్టీలు కలుస్తాయని గంటా వ్యాఖ్యానించారు. దసరా నాటికి ముఖ్యమంత్రి జగన్ విశాఖ రావాలని భావిస్తున్నారని, ఈ క్రమంలో ప్రభుత్వం దొంగ జీవో విడుదల చేసిందని ధ్వజమెత్తారు. ఈ జవో ఇచ్చిన అధికారులు సిగ్గుపడాలన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి వారికి ఎన్నికల ముందు ఇప్పుడు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు.