Chandrababu: అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న చంద్రబాబు న్యాయవాది.. కీలక సూచన చేసిన హైకోర్టు

AP High Court key suggestion to Govt in Chandrababu bail plea hearing
షార్ట్స్‌లో చూడండి
ఏపీ హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ తన వాదనలను వినిపిస్తూ... చంద్రబాబును అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. కేసుల విచారణకు సహకరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ.... ఈ విషయంపై హోంశాఖ, సీఐడీతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వం తరపు న్యాయవాదికి సూచించింది. భోజన విరామం తర్వాత తదుపరి విచారణను చేపడతామని చెప్పింది. 

Go Back to Shorts
Chandrababu
Telugudesam
AP High Court
Inner Ring Road Case
Angallu Case

More Telugu News