'ఆహా' తెరపైకి 'మిస్టేక్' .. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ!
- మూడు ప్రేమ జంటల కథ
- అడవి నేపథ్యంలో సాగే కథనం
- దర్శకుడిగా భరత్ పరిచయం
- ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్
అలాంటి ఈ సినిమాను ఈ నెల 13వ తేదీ నుంచి 'ఆహా' స్ట్రీమింగ్ చేయనుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. అభినవ్ సర్దార్ నిర్మించిన ఈ సినిమాకి, భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ నడుస్తుంది.
ముగ్గురు స్నేహితులు సిటీలో ఒక రూమ్ తీసుకుని ఉంటారు. ఈ ముగ్గురూ కూడా తమ లవర్స్ ను వెంటబెట్టుకుని ఒక ఫారెస్టుకు వెళతారు. అక్కడ వాళ్లు ఎలాంటి 'మిస్టేక్' చేస్తారు? ఫలితంగా ఎలాంటి ఆపదలో చిక్కుకుంటారు? అనే ఆసక్తికరమైన అంశాలతో కథ ముందుకు వెళుతుంది. మరి ఓటీటీ సెంటర్ నుంచి ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.