వైఎస్ భాస్కరరెడ్డికి నవంబర్ 1 వరకు ఎస్కార్ట్ బెయిల్ పొడిగింపు

YS Bhaskar Reddy escort bail till november 1
  • వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా వైఎస్ భాస్కరరెడ్డి
  • కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలిపిన వైఎస్ భాస్కరరెడ్డి
  • తదుపరి చికిత్స కోసం బెయిల్ పొడిగించాలని కోరిన భాస్కరరెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు వైఎస్ భాస్కర రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్‌ను సీబీఐ న్యాయస్థానం పొడిగించింది. తన బెయిల్ పిటిషన్ పొడిగించాలని ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నట్లు కోర్టుకు విన్నవించారు. వైద్యుల సూచన, తదుపరి చికిత్స కోసం తనకు ఇచ్చిన ఎస్కార్ట్ బెయిల్‌ను మరో రెండు నెలలు పొడిగించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారించిన న్యాయస్థానం నవంబర్ 1 వరకు ఎస్కార్ట్ బెయిల్‌ను పొడిగించింది.
Advertisement
YS Vivekananda Reddy
ys bhaskar reddy
Andhra Pradesh
CBI

More Telugu News