పసివాళ్ల మెదళ్లలో విషం నింపుతోందంటూ నారా భువనేశ్వరి ఉన్న ఫోటోను షేర్ చేసిన విజయసాయిరెడ్డి
- పసివాడి చేతికి మైక్ ఇచ్చి పెద్ద మాటలు మాట్లాడిస్తున్నారని టీడీపీ నేతలపై ఆగ్రహం
- లోకంలో లేని వైఎస్సార్‌ను తిట్టించి శునకానందం పొందుతున్నారని విమర్శ
- పసి మెదళ్లలోనూ విషం నింపుతూ పైశాచిక ఆనందం పొందడమేమిటో అంటూ ట్వీట్
ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేసిన విజయసాయిరెడ్డి టీడీపీపై మండిపడ్డారు. 'అన్నెం పున్నెం తెలియని పసివాడి చేతికి మైక్ ఇచ్చి పెద్ద మాటలు మాట్లాడించి శునకానందం పొందుతున్నారు టీడీపీ నేతలు. ఈ లోకంలో లేని వైఎస్సార్ గారినీ తిట్టిస్తున్నారు. పసి మెదళ్లలోనూ విషం నింపుతూ పైశాచిక ఆనందం పొందడమేమిటో!' అని ట్వీట్ చేశారు.