Vishal: విశాల్ మాటలు కొత్త సనాతన ధర్మంలా ఉన్నాయి: నిర్మాత కార్తీక్ వెంకట్రామన్ విమర్శలు

Producer Karthik Venkatraman comments on Vishal
షార్ట్స్‌లో చూడండి
తన తాజా చిత్రం 'మార్క్ ఆంటోనీ' హిట్ కావడంతో హీరో విశాల్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు సినిమా విడుదల తర్వాత కూడా విశాల్ ప్రమోషన్లను నిర్వహిస్తూ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నాడు. తాజాగా చిత్ర ప్రమోషన్ లో మాట్లాడుతూ నిర్మాతలుగా మారాలని ఆశిస్తున్న వారికి ఒక సలహా ఇచ్చాడు. మూడు, నాలుగు కోట్లు పట్టుకుని సినిమాలు తీయడానికి ఎవరూ రావద్దని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై నిర్మాత కార్తీక్ వెంకట్రామన్ కౌంటర్ ఇచ్చారు. విశాల్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.

సినిమా బడ్జెట్ కథను బట్టి, డిమాండ్ ను బట్టి ఉంటుందని చెప్పారు. ఇంత బడ్జెట్ లోనే సినిమాను నిర్మించాలనే నిబంధన ఏదీ లేదని అన్నారు. ఒక సినిమాను కోటి రూపాయలతో తీయొచ్చని లేదా రూ. 100 కోట్లతో కూడా తీయొచ్చని చెప్పారు. విశాల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడరాదని హితవు పలికారు. విశాల్ మాటలు వింటుంటే ఇదొక కొత్త సనాతన ధర్మమేమో అనిపిస్తోందని అన్నారు.
Go Back to Shorts
Vishal
Kollywood

More Telugu News