చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రి జైలుకు ఉత్తరాల వెల్లువ
- ‘బాబుతో నేను’ అంటూ వేలల్లో పోస్టు కార్డులు
- నాలుగు రోజులుగా ఉత్తరాలు రాస్తున్న అభిమానులు
- రాష్ట్రం నలుమూలల నుంచి పోస్టు కార్డుల ఉద్యమం
చంద్రబాబుకు మద్దతుగా ఈ నెల 16 నుంచి పోస్టుకార్డుల ఉద్యమం మొదలుకాగా.. ఈ నెల 20న రాజమండ్రి జైలుకు 2,150 ఉత్తరాలు వచ్చాయని సమాచారం. ఈ నెల 21న 6,250, శుక్రవారం 8,340 కార్డులు, శనివారం ఏకంగా 23,570 పోస్టుకార్డులు అందినట్లు తెలుస్తోంది. వీటికి అదనంగా నాలుగు రోజుల్లో స్పీడ్ పోస్టులో 60 ఉత్తరాలు, రిజిస్టర్డ్ పోస్టులో 90 ఉత్తరాలు, ఆర్డినరీ పోస్టులో 300 ఉత్తరాలు రాజమండ్రి కారాగారానికి చేరినట్లు అధికారులు వెల్లడించారు.