చంద్రబాబు గారూ! కేసును మీరే మరింత జటిలం చేసుకున్నారు: విజయసాయిరెడ్డి
- ఏ నేరం చేయలేదని బుకాయిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేయించారన్న విజయసాయిరెడ్డి
- కానీ ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే కోర్టు రిమాండ్ విధించిందని వెల్లడి
- క్వాష్ పిటిషన్ వేసి హైకోర్టుతో అక్షింతలు వేయించుకున్నారని విమర్శలు
చంద్రబాబు గారు కేసును తప్పుదోవ పట్టించి మరింత జటిలం చేసుకున్నారని పేర్కొన్నారు. ఏ నేరం చేయలేదని బుకాయిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేయించారని, కానీ ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే కోర్టు రిమాండు విధించిందన్న విషయాన్ని లెక్క చేయకుండా మెయింటెయినబుల్ కాని క్వాష్ పిటీషనుతో హైకోర్టుతో అక్షింతలు వేయించుకున్నారన్నారు.