AP Assembly Session: బాలకృష్ణ సహా టీడీపీ ఎమ్మెల్యేలందరిపై ఒకరోజు సస్పెన్షన్ వేటు.. సెషన్ మొత్తానికి పయ్యావుల సస్పెన్షన్!

All TDP MLAs suspended from AP Assembly
షార్ట్స్‌లో చూడండి
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నాటి సమావేశాల నుంచి టీడీపీ సభ్యులందరినీ ఒక్కరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇప్పటికే కోటంరెడ్డి, అనగాని సత్యప్రసాద్ లను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, సభలో వీడియో తీస్తున్నారంటూ పయ్యావుల కేశవ్ ను కూడా ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మరోవైపు, చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ తెలిపారు. దీంతో దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన మాట్లాడుతూ... విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంలో అద్దాలు, బాటిల్ పగులగొట్టారని... వారి తీరు క్రిమినల్స్ మాదిరి ఉందని చెప్పారు. ఇలాంటి సభా వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, బుచ్యయ్యచౌదరి, గద్దె రామ్మోహన్, చినరాజప్ప సహా టీడీపీ ఎమ్మెల్యేలందరినీ ఒక్కరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కూడా ఒక్కరోజు సస్పెన్షన్ వేటు వేశారు.
Go Back to Shorts
AP Assembly Session
Telugudesam
Suspension

More Telugu News