చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కెనడాలో భారీ నిరసన ప్రదర్శన.. ఫొటోలు ఇవిగో!
- దేశవిదేశాల్లో కొనసాగుతున్న నిరసనలు
- టొరొంటోలో 3 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ
- భారత రాయబారికి వినతిపత్రం
తాజాగా, కెనడాలోని టొరొంటోలో ప్రవాసాంధ్రులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. ఈ ప్రదర్శనలో స్థానికులతోపాటు ఆసియా, అమెరికన్లు కూడా పాల్గొన్నారు. నిజాయతీపరులకు న్యాయం జరగాలని నినదించారు. 3 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించిన అనంతరం టొరొంటోలోని భారత రాయబార కార్యాలయానికి చేరుకుని భారత రాయబారికి వినతిపత్రం అందించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయన వెంటనే జైలు నుంచి విడుదలయ్యేలా చూడాలని అందులో కోరారు. 
