చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు బాధాకరం: గల్లా జయదేవ్

Galla Jaydev reacts to Chandrababu arrest
  • చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు
  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్
  • చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన గల్లా జయదేవ్ 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంపై ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు బాధాకరమని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభ్యున్నతిపై దృష్టి  సారించిన నేత చంద్రబాబు అని కొనియాడారు. 

కాగా, కుంచనపల్లి సిట్ కార్యాలయంలో చంద్రబాబుపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. దాదాపు రెండు గంటల నిరీక్షణ అనంతరం చంద్రబాబుతో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం కుటుంబ సభ్యులు సిట్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.
Advertisement
Galla Jayadev
Chandrababu
Arrest
TDP
CID

More Telugu News