సజ్జల అన్నీ అబద్ధాలే చెపుతున్నారు: గద్దె రామ్మోహన్
- కృష్ణానది కరకట్టను వైసీపీ ప్రభుత్వం నిర్మించిందని సజ్జల చెపుతున్నారని గద్దె విమర్శ
- అక్కడి ప్రజలను అడిగితే ఎవరు నిర్మించారో చెపుతారని వ్యాఖ్య
- అసెంబ్లీలో వాస్తవాలను చెప్పకుండా తమ గొంతు నొక్కుతున్నారని మండిపాటు
5 కిలోమీటర్ల మేర మూడు విడతలుగా రీటెయిల్ వాల్ నిర్మించాలని చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. కరకట్టను తాము నిర్మిస్తే... వైసీపీ ప్రభుత్వమే చేసిందని సజ్జల చెప్పుకోవడం దారుణమని మండిపడ్డారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను అడిగితే కరకట్టను ఎవరు నిర్మించారో చెపుతారని అన్నారు. అసెంబ్లీలో స్పీకర్ తమ గొంతు నొక్కుతున్నారని... వాస్తవాలను ప్రజలకు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని అన్నారు.