భోళాశంకర్ సినిమాను రాజకీయానికి వాడుకోవద్దు: మంత్రి చెల్లుబోయిన వేణు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భోళాశంకర్ సినిమాను రాజకీయానికి వాడుకోవద్దు: మంత్రి చెల్లుబోయిన వేణు

Minister Venu suggests dont politicise Bhola Shankar film
  • ఈ సినిమా టిక్కెట్ ధరలు పెంచాలని దరఖాస్తు వచ్చిందన్న మంత్రి
  • 12 అంశాలపై ప్రభుత్వం వివరణ కోరిందని వెల్లడి
  • చిత్ర యూనిట్ నుండి ఎలాంటి వివరణ రాలేదన్న మంత్రి వేణు
  • గతంలో వాల్తేరు వీరయ్య చిత్రం టిక్కెట్ ధరలు పెంచినట్లు గుర్తు చేసిన మంత్రి
భోళాశంకర్ సినిమా టిక్కెట్ ధరల పెంపుపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మంత్రి చెల్లుబోయిన వేణు స్పందించారు. చిరంజీవి నటించిన ఈ సినిమా టిక్కెట్ ధరలను పెంచాలని తమ వద్దకు దరఖాస్తు వచ్చిందని చెప్పారు. అయితే 12 అంశాలపై ప్రభుత్వం స్పష్టతను కోరిందని, కానీ చిత్ర యూనిట్ నుండి ఎలాంటి వివరణ రాలేదన్నారు. గతంలో వాల్తేరు వీరయ్య చిత్రానికి టిక్కెట్ రేట్లు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. భోళాశంకర్ సినిమాను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం విరమిస్తే మంచిదని హితవు పలికారు.
Advertisement
Chelluboina Venu
bhola shankar
Chiranjeevi

More Telugu News