ఫైనాన్స్ కంపెనీ ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు..నితిన్ దేశాయ్ మృతిపై స్నేహితుడి వ్యాఖ్య

Nitin Desai Couldnt Bear Stress Was Pressured By Finance Company says Friend
  • ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్‌పై  ఫైనాన్స్ సంస్థలు అప్పు తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాయన్న స్నేహితుడు
  • ఒత్తిడి తట్టుకోలేకే మరణంవైపు అడుగులు వేసి ఉంటాడని వ్యాఖ్య
  • ఈమారు పుట్టినరోజు జరుపుకోనని నితిన్ దేశాయ్ గతంలో వ్యాఖ్యానించారని వెల్లడి
  • ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటాడని అప్పట్లో ఊహించలేదని వ్యాఖ్య
బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై ఆయన స్నేహితుడు నితిన్ కులకర్ణి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పు తిరిగి చెల్లించాలంటూ ఫైనాన్స్ కంపెనీ ఒత్తిడి తేవడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ‘‘అప్పులిచ్చిన ఫైనాన్స్ సంస్థలతో నితిన్ దేశాయ్ భార్య ఇబ్బందులు పడకుండా ఉందేందుకు మార్గాలను అన్వేషిస్తున్నా. ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా’’ అని తెలిపారు. 

నితిన్ దేశాయ్ కూతురు అమెరికా వెళ్లేముందు కుటుంబమంతా కలిసి ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని భార్య, కూతురు పట్టుబట్టిన విషయాన్ని నితిన్ కులకర్ణి గుర్తు చేసుకున్నారు. అయితే, ఈ మారు తాను పుట్టినరోజు జరుపుకోనని నితిన్ దేశాయ్ చెప్పారని అన్నారు. చివరకు ఆయన ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటారని తాము అప్పట్లో అస్సలు ఊహించలేదని విచారం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Nitin Desai
Bollywood
Tollywood

More Telugu News