ఈ సబ్జెక్ట్ లో నాతో ఎవరూ పోటీ పడలేకపోయేవారు: జాన్వీ కపూర్

I was good at history subject  says Janvi Kapoor
  • నిన్న ఓటీటీలోకి వచ్చిన జాన్వీ కపూర్ 'బవాల్' మూవీ
  • చరిత్ర, వర్తమాన కథాంశంతో తెరకెక్కిన చిత్రం
  • పాఠశాల రోజుల నుంచి తనకు చరిత్ర అంటే ఇష్టమని చెప్పిన జాన్వీ
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో దూసుకుపోతోంది. వరుస ఆఫర్లతో బాలీవుడ్ బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. యూత్ ఆడియెన్స్ లో జాన్వీకి భారీ క్రేజ్ ఉంది. మరోవైపు ఆమె తాజా చిత్రం 'బవాల్' నిన్న ఓటీటీలోకి వచ్చింది. చరిత్ర, వర్తమాన అంశాల కలబోతతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ... ఈ సినిమా తనను నటిగా ఒక మెట్టు ఎక్కించిందని చెప్పింది. చరిత్ర అంటే తనకు పాఠశాల రోజుల నుంచి ఇష్టమని తెలిపింది. 

స్కూల్ డేస్ లో తాను యావరేజ్ స్టూడెంట్ నని... అయితే హిస్టరీ సబ్జెక్ట్ లో మాత్రం తనతో ఎవరూ పోటీ పడలేకపోయేవారని జాన్వీ చెప్పింది. చరిత్రకు సంబంధించిన ఎస్సే రైటింగ్ పోటీల్లో కూడా తనకే ప్రైజులు వచ్చేవని తెలిపింది. ప్రపంచ చరిత్రపై కూడా తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పింది. తమ 'బవాల్' సినిమాలో రెండో ప్రపంచ యుద్ధ ప్రస్తావన ఉంటుందని తెలిపింది. 

ఇక ఈ సినిమా కోసం 'ఏ మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్' అనే పుస్తకాన్ని చదివానని... నాజీల కాన్సన్ ట్రేషన్ క్యాంపుల్లో యూదులు అనుభవించిన కష్టాలను ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నానని చెప్పింది. భవిష్యత్తులో కూడా చరిత్రకు సంబంధించిన సినిమాల్లో నటించే అవకాశం వస్తే వదులుకోనని తెలిపింది. మరోవైపు టాలీవుడ్ లోకి కూడా జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆమె 'దేవర' చిత్రంలో నటిస్తోంది.
Go Back to Shorts
Janvi Kapoor
Bollywood
Tollywood
History
Bawaal

More Telugu News