ఒక రేంజ్ లో 'బ్రో' బిజినెస్ .. మైత్రీ చేతికి నైజామ్ హక్కులు!
- పవన్ - సాయితేజ్ ల 'బ్రో'
- 'వినోదయా సితం'కి రీమేక్
- 30 కోట్లకు నైజామ్ హక్కులు
- ఈ నెల 28వ తేదీన సినిమా రిలీజ్
ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ నచ్చడం వల్లనే పవన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. కథాపరంగా ఈ సినిమాకి చాలా తక్కువ మంది ఆర్టిస్టులు మాత్రమే అవసరం. తక్కువ బడ్జెట్ లో .. తక్కువ రోజుల్లో ఈ సినిమాను పూర్తిచేశారు. అలాంటి ఈ సినిమా బిజినెస్, పవన్ కి గల క్రేజ్ కారణంగా ఒక రేంజ్ లో జరుగుతోంది.
ఈ సినిమా నైజామ్ హక్కుల కోసం గట్టిపోటీ ఏర్పడిందని అంటున్నారు. చివరికి మైత్రీ మూవీస్ వారు, తమ సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా నైజామ్ హక్కులను దక్కించుకున్నట్టుగా చెబుతున్నారు. ఇందుకోసం 30 కోట్లను చెల్లించినట్టుగా టాక్ నడుస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు.