పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సనాఖాన్
- కల్యాణ్ రామ్, మంచు మనోజ్ సరసన నటించిన సనా ఖాన్
- 2020లో అనాస్ అహ్మద్ ను పెళ్లాడిన సనా
- కెరీర్ బాగున్నప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్పిన బాలీవుడ్ భామ
తాజాగా సనాఖాన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తాను తల్లి అయినట్టు ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తమపై ప్రేమాభిమానాలు చూపుతున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పింది. మీ దీవెనలు తమ బిడ్డపై కూడా ఉండాలని కోరింది. మరోవైపు తల్లి అయిన సనాకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.