Goldy Brar: సల్మాన్‌ఖాన్‌ను ఎలా అయినా చంపేస్తాం.. గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ హెచ్చరిక

Will definitely kill Salman Khan warns gangster Goldy Brar
  • ‘ఇండియాటుడే’ ఎక్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో గోల్డీబ్రార్ హెచ్చరిక
  • సల్మాన్‌ను క్షమించబోనని లారెన్స్ ఇప్పటికే చెప్పాడని గుర్తు చేసిన గ్యాంగ్‌స్టర్
  • బతికున్నంత వరకు శత్రువులపై దాడులు చేస్తూనే ఉంటామన్న బ్రార్
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌ను ఎలా అయినా చంపి తీరుతామని కెనడాకు పారిపోయిన గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ హెచ్చరించాడు. ‘ఇండియా టుడే’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో గోల్డీబ్రార్ మాట్లాడుతూ ఈ హెచ్చరికలు జారీ చేశాడు. సల్మాన్‌ను చంపేస్తామంటూ ఆయన అనుచరులు ఇప్పటికే పలుమార్లు ఈమెయిళ్ల ద్వారా హెచ్చరించారు. గతేడాది మేలో జరిగిన పంజాబీ సింగర్, రాజకీయ నాయకుడు సిద్దూ మూసేవాలా హత్యకేసు ప్రధాన సూత్రధారి గోల్డీబ్రారేనని పోలీసులు భావిస్తున్నారు.

‘‘మేం అతడిని (సల్మాన్‌ఖాన్) చంపేస్తాం. తప్పకుండా చంపి తీరుతాం. తాను క్షమించబోనని భాయ్ సాబ్ (లారెన్స్)  ఇప్పటికే తేల్చి చెప్పాడు. బాబా కరుణిస్తేనే ఆయన దయతలుస్తాడు’’ అని బ్రార్ చెప్పుకొచ్చాడు. సల్మాన్‌‌ను చంపడమే తన జీవిత లక్ష్యమని జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశాడు. 

‘‘సల్మాన్‌ఖాన్ ఒక్కడే కాదు.. మేం బతికున్నంత కాలం మా శత్రువుల అందరిపైనా దాడులు చేస్తూనే ఉంటాం. సల్మాన్‌ఖాన్ మా లక్ష్యం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మేం ప్రయత్నిస్తూనే ఉంటాం. విజయం సాధించినప్పుడు మీకు తెలుస్తుంది’’ అని బ్రార్ నొక్కి చెప్పాడు.
Goldy Brar
Salman Khan
Bollywood
Lawrence Bishnoi

More Telugu News