Ram Charan: బిడ్డతో ఇంటికి వెళుతూ... రామ్ చరణ్, ఉపాసనల ఫొటోలు ఇవిగో!

- తొలిసారిగా తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసన
- జూన్ 20న అమ్మాయికి జన్మనిచ్చిన ఉపాసన
- నేడు అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తొలిసారిగా తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. జూన్ 20న ఉపాసన పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రి నుంచి ఉపాసన ఇవాళ డిశ్చార్జి అయ్యారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కలలపంట, ఆశల మణిదీపం అయిన చిన్నారిని చేతుల్లో పొదివిపట్టుకుని ఎనలేని సంతోషంతో ఆసుపత్రి వెలుపలికి వచ్చారు. నగరంలోని తమ నివాసానికి వెళుతున్న ఈ సెలబ్రిటీ కపుల్ ను మీడియా తమ కెమెరాల్లో బంధించింది. ఆ ఎక్స్ క్లూజివ్ ఫొటోలు మీ కోసం...





