ముద్దు సీన్లలో నటించక తప్పలేదు.. కారణం ఇదే: తమన్నా
- మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తాను కూడా మారానన్న తమన్నా
- మొబైల్ ఫోన్ వల్ల అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయని వ్యాఖ్య
- 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ లో ముద్దులకు ఓకే చెప్పానని వెల్లడి
అయితే తాజాగా ఆమె మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తాను కూడా మారానని చెప్పింది. ఇప్పుడు అందరి చేతిలో మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిందని... అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయని... ఈ నేపథ్యంలో ముద్దు సన్నివేశాలను కూడా సృజనాత్మకతలో ఒక భాగంగానే చూడాల్సి వస్తోందని తెలిపింది. అందుకే 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ లో ముద్దులకు ఓకే చెప్పానని వెల్లడించింది. కథ డిమాండ్ మేరకే ఈ సన్నివేశాలను చేయాల్సి వచ్చిందని చెప్పింది.