పవన్ కల్యాణ్ నేటి వారాహి యాత్ర షెడ్యూల్ ఇదే!

Pawan Kalyan Varahi Yatra schedule
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల కార్యరంగంలోకి దిగారు. తన ప్రచార రథం వారాహిలో యాత్రను ప్రారంభించారు. నిన్న అన్నవరం ఆలయంలో సత్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం ఆయన తన వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. తొలి విడతలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో ఆయన యాత్ర కొనసాగనుంది. ఈ నెల 23 వరకు తొలి విడత యాత్ర కొనసాగుతుంది. ఈ విడతలో 7 బహిరంగసభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఈరోజు పవన్ యాత్ర పిఠాపురం నియోజకవర్గంలో కొనసాగనుంది. 

ఈనాటి పవన్ యాత్ర షెడ్యూల్:
  • ఉదయం 11 గంటలకు గొల్లప్రోలులోని సత్యకృష్ణ ఫంక్షన్ హాల్ లో జనవాణి కార్యక్రమం. 
  • మధ్యాహ్నం 12 గంటలకు ఇదే ఫంక్షన్ హాల్ లో జనసేన వీర మహిళ విభాగం ప్రతినిధులతో సమావేశం. 
  • సాయంత్రం 4 గంటలకు చేబ్రోలులో నేత కార్మికులతో భేటీ.
Go Back to Shorts
Pawan Kalyan
Jana Reddy
Varahi Vijaya Yatra

More Telugu News