జగన్ కు పవన్ కల్యాణ్ సవాల్ విసరడంపై అంబటి రాంబాబు కౌంటర్
- తాను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా జగన్ ఎలా అడ్డుకుంటారో చూస్తానన్న పవన్
- కేవలం ఎమ్మెల్యే కావడం కోసం పార్టీ పెట్టడం ఎందుకన్న అంబటి
- రాజకీయం అంటే ఏమిటో పవన్ నేర్చుకోవాలని వ్యాఖ్య
పవన్ వ్యాఖ్యలపై అంబటి స్పందిస్తూ... కేవలం ఎమ్మెల్యే కావడం కోసం పార్టీని పెట్టడం ఎందుకని సెటైర్ వేశారు. వారాహి వాహనానికి ఎన్నిసార్లు పూజలు చేస్తారని, అదేమైనా యుద్ధ ట్యాంకా అని ఎద్దేవా చేశారు. రాజకీయం అంటే ఏమిటో పవన్ కల్యాణ్ నేర్చుకోవాలని చెప్పారు. కేంద్రంలోని బీజేపీని ఒప్పించి కాపులకు రిజర్వేషన్లను ఇప్పించాలని అన్నారు. కాపులకు రిజర్వేషన్లను ఇవ్వని చంద్రబాబుతో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు.