పవన్ కోసం.. లోకేషన్లు షిఫ్ట్ చేస్తున్న దర్శక నిర్మాతలు
- సినిమాలతో పాటు రాజకీయాలపై పవర్ స్టార్ ఫోకస్
- ఆయన కోసం విజయవాడ, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్స్ చేయాలని నిర్ణయం
- రేపటి నుంచి ‘వారాహి యాత్ర’ చేపట్టనున్న పవన్
ఈ క్రమంలో పవన్, దర్శక నిర్మాతల మధ్య చర్చ జరిగింది. రాజకీయాల్లో బిజీగా కానున్న పవన్ కు అనువుగా ఉండేలా ఇకపై విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగులు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని లొకేషన్లను దర్శక నిర్మాతలు చూసి వచ్చారు. మంగళగిరికి తొలిసారి వచ్చానని.. ఈ ప్రాంతం షూటింగులకు అనుకూలంగా ఉందని హరీశ్ శంకర్ తెలిపారు. పవన్ ఇకపై మంగళగిరిలో ఉంటారని, ఆయన సినిమా షూటింగులే కాకుండా, ఇతర సినిమాల షూటింగులను ఇక్కడ కూడా నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగులు జరగబోతున్నాయని చెప్పారు.