Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాల కొత్త చిత్రం ‘పెదకాపు’.. సినిమా పోస్టర్ రిలీజ్!

srikanth addala film pedakapu1 first look released
షార్ట్స్‌లో చూడండి
‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సెన్సిటివ్ చిత్రాలతో సెన్సేషనల్ హిట్లు కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. అయితే తర్వాత ఆ స్థాయిలో హిట్లు కొట్టలేదు. ‘ముకుంద’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలు నిరాశపరిచాయి. తమిళ ‘అసురన్’కు రీమేక్ గా తెరకెక్కించిన ‘నారప్ప’ నేరుగా ఓటీటీలోనే రిలీజైంది.

ఈ నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంపై అప్ డేట్ వచ్చింది. ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను, టైటిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘పెదకాపు-1’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. విరాట్ కర్ణను హీరోగా వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో విరాట్ కర్ణ ఇంటెన్స్ లుక్‌ ఆకట్టుకుంటోంది. భారీ జనసమూహంలో విజయానికి గుర్తుగా అభివాదం చేస్తూ కనిపించారు విరాట్ కర్ణ. పోస్టర్‌లో ‘ఓ సామాన్యుడి సంతకం’ అనే ట్యాగ్‌‌లైన్‌ ఆసక్తి రేపుతోంది. 

చిత్రంలోని ఇతర తారాగణం గురించిన వివరాలేవీ ప్రకటించలేదు. మరోవైపు ‘పెద కాపు- 1’ అని టైటిల్ పెట్టడంపైనా స్పష్టత లేదు. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ‘అఖండ’ వంటి చిత్రాన్ని నిర్మించిన ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్నారు. 
Go Back to Shorts
Srikanth Addala
PedaKapu-1
Virat Karrna
Dwaraka Creations

More Telugu News