మతమార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతాం: ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ బాపూరావు
- ఆదివాసీ ఆడపిల్లలను ముస్లింలు, క్రిస్టియన్లు టార్గెట్ చేస్తున్నారన్న బాపూరావు
- మతం మారిన ఆదివాసీలకు ఎస్టీ హోదా తొలగించాలని డిమాండ్
- ఆదివాసీలు చైతన్యవంతులు కావాలని పిలుపు
జ్వరం వచ్చిన ఆదివాసీలకు పారాసిటమాల్ టాబ్లెట్ వేసిన నీటిని దైవజలం అని తాగించి... ఆ తర్వాత మాయ మాటలతో మతం మారేలా చేస్తున్నారని బాపూరావు మండిపడ్డారు. ఉద్యోగాలు వచ్చిన ఆదివాసీ ఆడపిల్లలను టార్గెట్ చేస్తూ మత మార్పిడిలు జరుగుతున్నాయని చెప్పారు. ఆదివాసీలు చైతన్యవంతులై, మత మార్పిడిలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.