ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్.. బయట కాల్పులు
- కోర్టు నుంచి బయటకు వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో కాల్పులు
- తమ సిబ్బందిపై కాల్పులు జరిగాయన్న పోలీసులు
- కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని వివరణ
కాల్పులతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు వద్ద భద్రతను పెంచారు. ఆ తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పీటీఐ చీఫ్ ఇమ్రాన్‌ను ఈ నెల 15 వరకు అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు ఆదేశాల తర్వాత కాల్పులు జరగడం గమనార్హం. లాహోర్‌లో నమోదైన మూడు ఉగ్రవాదం కేసులు, జిల్లే షా హత్య కేసుల్లో అరెస్ట్ నుంచి ఇమ్రాన్‌కు రక్షణ కల్పిస్తూ కోర్టు బెయిలు మంజూరు చేసింది.