దేశ వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ చేతులు కలుపుతోంది: నరేంద్ర మోదీ
- కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు
- సమాజం ప్రశాంతంగా ఉంటే.. కాంగ్రెస్ ప్రశాంతంగా ఉండదని వ్యాఖ్య
- దేశం అభివృద్ధి, ప్రగతి పథంలో నడుస్తుంటే ఆ పార్టీకి నచ్చడం లేదని ఎద్దేవా
సమాజం ప్రశాంతంగా ఉంటే.. కాంగ్రెస్ ప్రశాంతంగా ఉండలేదని విమర్శించారు. దేశం అభివృద్ధిలో, ప్రగతిపథంలో పయనిస్తుంటే కాంగ్రెస్ సహించడం లేదన్నారు. ఆ పార్టీ కేవలం ‘విభజించు, పాలించు’ సూత్రంపైనే రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీ ప్రమాదకర వైఖరికి సాక్ష్యంగా కర్ణాటక నిలుస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకను ఏటీఎంలా వాడుకోవాలని చూస్తోందన్నారు. బీజేపీ మాత్రం కర్ణాటక అన్ని రంగాల్లో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలని కోరుకుంటోందని చెప్పారు. కాంగ్రెస్ రిటైర్‌మెంట్ పేరుతో ఓట్లు అడుగుతోందని, బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోందని దుయ్యబట్టారు.