'పొన్నియిన్ సెల్వన్ 2'కి హైలైట్ గా నిలవనున్న త్రిష రొమాన్స్!

Ponniyin Selven Update
త్రిష కెరియర్ ను గమనిస్తే ఇక ఆమె పనైపోయిందని అనుకున్న ప్రతిసారీ మళ్లీ పుంజుకుంటూనే వచ్చింది. కెరియర్ పరంగా 20 ఏళ్లు పూర్తయినప్పటికీ, అవకాశాల కోసం వెయిట్ చేసే పరిస్థితిలో ఆమె లేదు. ఇంతకాలమైనా ఆమె గ్లామర్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతూనే ఉన్నారు. సీనియర్ స్టార్ హీరోలు తమ సినిమాల్లో ఆమెనే కావాలని పట్టుబడుతున్న సందర్భాలు ఉన్నాయి. 

అలాంటి త్రిష 'పొన్నియిన్ సెల్వన్ 1' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె 'కుందవై' అనే పాత్రలో కనిపిస్తుంది. ఈ పాత్ర ఎంత గొప్పదనే విషయం ఈ నవల చదివిన చాలామందికి తెలుసు. అలాంటి పాత్రలో ఈ సినిమాలో త్రిష అందంగా మెరిసింది. మణిరత్నం ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానం గొప్పగా ఉంటుంది. అయితే ఫస్టు పార్టులో ఆమె మనసు వల్లవరాయన్ (కార్తి) వైపు మొగ్గుచూపుతున్నట్టుగా మాత్రమే చూపించారు. ఇక 'పొన్నియిన్ సెల్వన్ 2' లో మాత్రం త్రిష - కార్తి మధ్య రొమాన్స్ ను ఒక రేంజ్ లో చూపించినట్టుగానే తెలుస్తోంది. కార్తితో తన రొమాన్స్ గాఢంగానే ఉంటుందని ప్రమోషన్స్ లో త్రిష చెప్పింది. ఇక కార్తి పాత్రకి ఆ స్థాయి రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కడం పట్ల తాము అసూయ పడినట్టు ప్రమోషన్స్ లో సరదాగా విక్రమ్ .. జయంరవి చెప్పిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా టీమ్ రొమాన్స్ ను హైలైట్ చేస్తూ వెళ్లడం విశేషం. ఈ నెల 28న ఈ సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. 

Go Back to Shorts
Vikram
Karthi
Jayam Ravi
Aishwarya Rai
Trisha

More Telugu News