ఏపీలో రాబోయే మూడ్రోజులకు వాతావరణ హెచ్చరిక
- గురువారం నాడు ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు
- దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం
- అక్కడక్కడ వడగాలులు
కాగా, ఏపీకి సంబంధించి రాబోయే మూడ్రోజులకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదిక విడుదల చేసింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని, ఒకట్రెండు చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి నుంచి ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
దక్షిణ కోస్తాలో నేడు, రేపు పొడి వాతావరణం ఉంటుందని, వడగాలులు వీస్తాయని, ఎల్లుండి గురువారం కూడా పొడి వాతావరణమే ఉంటుందని వివరించింది.
రాయలసీమలో సైతం ఈ మూడ్రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. అదే సమయంలో వడగాలులు కూడా వీస్తాయని తెలిపింది.