పాదయాత్రలో నారా లోకేశ్ కు తప్పిన ప్రమాదం
- ఈరోజు రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గాల్లో కొనసాగిన లోకేశ్ పాదయాత్ర
- లోకేశ్ ను గజమాలతో సత్కరించిన టీడీపీ అభిమానులు
- గజమాల తెగి లోకేశ్ పై పడిన వైనం
భారీ గజమాలను క్రేన్ సహాయంతో లోకేశ్ కు వేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో క్రేన్ వైర్లు తెగాయి. దీంతో, మాల ఆయనపై పడింది. అయితే లోకేశ్ వెంటనే అప్రమత్తమై తప్పించుకున్నారు. దీంతో, ఆయనకు ప్రమాదం తప్పింది. లోకేశ్ కు ఏమీ కాకపోవడంతో అక్కడున్న టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.