సిద్ధిపేట అదనపు కలెక్టర్ కు కుక్క కాటు
- తన క్వార్టర్స్ ముందు వాకింగ్ చేస్తుండగా దాడి చేసిన శునకం
- కలెక్టరేట్ లో బీభత్సం సృష్టిస్తున్న వీధి కుక్కలు
- మరో ఇద్దరు సిబ్బందిపైనా దాడి చేసి గాయపరిచిన వైనం
కుక్క దాడిలో శ్రీనివాస్ రెడ్డి రెండు కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో సిబ్బంది వెంటనే ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదనపు కలెక్టర్ ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా, శ్రీనివాస్ రెడ్డిని గాయపరిచిన రోజే మరో ఇద్దరు కూడా కుక్క కాటుకు గురయ్యారని అధికారులు తెలిపారు. కలెక్టరేట్ కు దగ్గర్లోని పౌల్ట్రీఫాం వద్ద ఓ బాలుడిపైనా వీధి కుక్క దాడి చేసిందని వివరించారు.